ఈ మధ్య కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
దీంతో చాలా మందికి లే ఆఫ్ టెన్షన్ ఎక్కువైపోయింది. .
ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
సంస్థ మూసివేసినా, సంస్థ తీసేసినా.. లేదా ఏదైనా కారణం వల్ల ఉద్యోగం కోల్పోయినా గానీ మళ్ళీ జాబ్ దొరికేవరకూ ఆదాయం లేకపోతే చాలా కష్టమవుతుంది.
జాబ్ దొరికేవరకూ నెల, రెండు నెలలు జీతం వస్తే బాగుణ్ణు అని ఎప్పుడైనా అనుకున్నారా?
అయితే మీ కోసమే ఈ సరికొత్త ప్లాన్. నెలకు రూ. 33, రూ. 83 ప్లాన్ తో మీరు మీ ఉద్యోగానికి రక్షణ పొందవచ్చు.
మీరు ఉద్యోగం కోల్పోతే కనుక క్లెయిమ్ చేసుకుంటే 3 నెలల పాటు నెల జీతం వస్తుంది.
ఆ తర్వాత 3 నెలలు అత్యవసర ఫండ్ కింద కనీస అవసరాల కోసం నెలకు కొంత డబ్బు వస్తుంటుంది.
ఈ క్రమంలో వేరే కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చేలా చేస్తారు.
లేజీ పే అనే ఫైనాన్స్ సంస్థ.. ‘ప్రొటెక్ట్ యువర్ ఇన్కమ్’ పేరిట ఒక ఎస్యూర్ కిట్ ని ఆఫర్ చేస్తుంది.
ఈ కిట్ కింద ప్లాన్ కొనుగోలు చేసిన వారికి ఇన్కమ్ ఎస్యూరెన్స్ అనేది ఉంటుంది.
ఉదాహరణకు మీ జీతం నెలకు 25 వేలు అనుకుంటే కనుక.. ఈ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత మీరు ఉద్యోగం కోల్పోయారనుకోండి.
అప్పుడు మీకు నెలకు రూ. 25 వేల చొప్పున మూడు నెలల పాటు ఇస్తారు.
ఆ తర్వాత 3 నెలలు నెలకు రూ. 2500 చొప్పున కనీస అవసరాల కోసం ఇస్తారు.
జీతం బట్టి నెలకు ఇంత అని ఉంటుంది. ఈ 6 నెలల్లోపు మీకు వేరే కంపెనీలో ఉద్యోగం చూస్తారు.
వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా వీరి నెట్వర్క్ పెద్దగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగం కూడా త్వరగా వస్తుంది.