శరీరానికి కావల్సిన విటమిన్స్ లో ప్రధానమైనది విటమిన్ బి 12. విటమిన్ బి 12 ఎర్ర రక్తకణాలు, డీఎన్ఏ ఏర్పడడానికి సహాయపడుతుంది.

విటమిన్ బి12 ఉన్న ఆహారం తింటే నరాలు, మెదడుకు సంబంధించి ఎలాంటి సమస్యలూ రావు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

మరి విటమిన్ బి12 ఉన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి.

సాక్కీ సాల్మన్, సార్డినెస్, రెయిన్ బో ట్రౌట్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది.

ఇది మెదడుని, నాడీకణాలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. 

విటమిన్ బి 12తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం, భాస్వరం, విటమిన్ ఎ, విటమిన్ బి3 వంటి ప్రోటీన్లు   

విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.

ఈ ఆహారాలను రోజూ తింటే మెదడు, నరాలు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. వీటికి సంబంధించిన సమస్యలు రానే రావు.

క్లామ్స్ లో విటమిన్ బి12, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

చికెన్, గొర్రె, మేక మాంసం వంటివి విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్ వంటివి శరీరానికి అందుతాయి. 

ఇవి గుండె సంబంధిత సమస్యలను నియంత్రించేందుకు సహకరిస్తాయి.

గుడ్డులో విటమిన్ బి2, విటమిన్ బి12 ఉంటాయి. గుడ్డులోపల ఉండే సొనలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది.

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. దీనితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం, పొటాషియం, జింక్, కోలిన్, విటమిన్ ఎ, విటమిన్ డి ఉంటాయి.

బచ్చలికూర, బీట్ రూట్, బంగాళదుంప, పుట్టగొడుగులు, బటర్ నట్ స్క్వాష్ వంటి వాటిలో విటమిన్ బి12 అత్యధికంగా ఉంటుంది.