సూర్య నమస్కారం కూడా యోగాలో ఒక భాగం. యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

యోగాలో ముఖ్యమైనది సూర్య నమస్కారం. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సూర్య నమస్కారం చేయడం వల్ల బరువు తగ్గుతారు. సూర్య నమస్కారం వల్ల కొవ్వు కరుగుతుంది.  

సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని అన్ని శరీర భాగాలకు రక్త సరఫరా అయ్యేలా చేస్తుంది.

చర్మం యవ్వనంగా, దృఢంగా తయారవుతుంది. ముఖం ప్రకాశించేలా చేస్తుంది. చర్మంపై ముడతలు  రాకుండా ఉంటుంది.

సూర్య నమస్కారం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఉత్తేజంగా ఉంటారు.

సూర్య నమస్కారం వల్ల రక్త ప్రసరణ బాగా సాగుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

సూర్య నమస్కారంలోని వివిధ భంగిమలు తెల్ల జుట్టును నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సూర్య నమస్కారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

శరీర జీవక్రియను పెంచడంలో సూర్య నమస్కారం ఎంతగానో సహాయపడుతుంది.

కొన్ని యోగా భంగిమలు లేదా కార్డియో వ్యాయామాలతో సూర్య నమస్కారం చేస్తే జీవక్రియ పెరుగుతుంది.

సూర్య నమస్కారం అనేది మనసు, శరీరం.. రెండిటికీ సంబంధించిన వ్యాయాయం. 

కాబట్టి ప్రతి రోజూ సూర్య నమస్కారం చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు.