ఇళ్లలో అనేక రకాల కీటకాలు తిరుగుతూ ఉంటడంట సర్వసాధారణం.

అలానే బల్లులు కూడా ఇళ్లల్లో తెగ తిరుగుతుంటాయి.

వీటిని చూసి కొందరు వాంతులు సైతం చేసుకుంటారు.

ఇవి ఇంట్లోని వస్తువులు, దుస్తువుల మీద తిరుగుతుంటాయి.

బల్లులు పురుగులని తినేస్తూ మనకు మేలు చేస్తుంది, అయినా ఇంట్లో ఉండాలని ఎవరు కొరుకోరు.

అయితే వాటిని ఇంట్లో తిరగకుండా చేయాలంటే ఈ కిందివి పాటిస్తే చాలని నిపుణులు అంటున్నారు.

అపరిశుభ్రంగా ఉన్నా ఇళ్లల్లోనే బల్లులు తిరుగుతుంటాయి.

కాబట్టి  ఇంటిని చెత్తాచెదారం లేకుండా చేసుకోవడం ద్వారా బల్లుల సమస్య తొలగించుకోవచ్చు.

బల్లులకు సిట్రస్ వాసన పడదు.. కాబట్టి  సిట్రస్ ఫలాన్ని, ఆకులను ఇంట్లో ఉంచుకోవాలి. 

నిమ్మకాయ ఆకులను కాల్చి ఆ పొగను ఇంట్లో వ్యాపించేలా చేస్తే బల్లుల బెడద తగ్గుతుంది.

కర్పూరం బిల్లలు తీసుకోని, ఇంట్లో అక్కడక్కడ పెట్టడం ద్వారా కూడా బల్లులను నివారించవచ్చు.

ఇంట్లోనే అనవసరపు రంధ్రాలను మూసివేయడం ద్వారా బల్లులను అరికట్టవచ్చు.

బల్లులు తినే ఆహారం ఇంట్లో లేకుండా చేయడం ద్వారా వాటిని లేకుండా చేయవచ్చు.

వినడానికి విచిత్రంగా ఉన్నా.. నెమలి ఈకలు అంటే బల్లులకు భయమని కొందరి అభిప్రాయం.

ఆ నెమలీకలను తెచ్చి.. ఇంట్లో అక్కడక్కడ పెట్టేస్తే బల్లుల బెడద తగ్గుతుందంట.

మీకు పిల్లులని పెంచుకునే అలవాటు ఉంటే  బల్లుల విషయంలో పెద్దగా బెంగ అక్కరలేదు.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.