ఓపెన్ ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే చాట్ జీపీటీ గురించి అందరికీ తెలుసు.
మీ ప్రశ్నలకు ఒక మనిషి ఎలా అయితే సమాధానం చెబుతాడో.. ఈ చాట్ బాట్ కూడా అలాగే సమాధానం చెబుతుంది.
ఈ చాట్ జీపీటీని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు భారత్ లో నెలకు రూ.1600 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
మీకు ఒక పర్సనల్ గైడ్ గా ఉంటూ.. వ్యాపార అభివృద్ధికి కూడా దోహద పడుతుంది.
ఇప్పుడు ఈ ఏఐ చాట్ బాట్ ని ఉపయోగించుకుని డబ్బు కూడా సంపాదిస్తున్నారు.
చాట్ జీపీటీని వాడుతూ రోజుకు వేలల్లో సంపాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఒక తెలుగు టెక్ యూట్యూబర్ చాట్ జీపీటోతో రోజుకు రూ.2 వేల వరకు సంపాదించినట్లు వీడియో పోస్ట్ చేశాడు.
అందుకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఆ యూట్యూబర్ వీడియోలో పోస్ట్ చేశాడు.
చాట్ జీపీటీని పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసేందుకు ఐడియాస్ కోరాడు.
చాట్ జీపీటీ చెప్పిన వాటిలో అఫ్లియేట్ మార్కెటింగ్ ని అతను ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు.
తర్వాత ఒక ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజ్ తో కన్సల్ట్ అయ్యి తన సలహాలను తీసుకున్నాడు.
అతను చెప్పినట్లుగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి దానిని ప్రమోట్ చేయించాడు.
ఆ తర్వాత అఫ్లియేట్ మార్కెట్ కి సంబంధించిన కొన్ని యాప్స్ లింక్స్ ని ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.
ఆ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్లకు యూట్యూబర్ కు ఆదాయం వచ్చింది.
అది కూడా నాలుగు రోజుల్లో దాదాపు రూ.8 వేల వరకు దక్కినట్లు అతను తెలిపాడు.