మనిషికి.. గొడ్డుకు మధ్య తేడాను తెలియజేసేది ఎమోషన్సే..
ఈ ఎమోషన్సే ఒకరితో ఒకరిని దగ్గర చేస్తాయి.. ఇద్దరి మధ్యా దూరాన్ని కూడా పెంచుతాయి.
అయితే, ఎమోషన్స్ పూర్తిగా మన కంట్రోల్ తప్పితే పెను ప్రమాదమే.
అన్ని విధాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎమోషన్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి.
ఎమోషన్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవటానికి ఈ పనులు చేయండి..
ఎమోషన్స్ మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించండి.
మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయటానికి ప్రయత్నించండి.
ఏ విషయంలో ఎక్కువగా బాధపడుతున్నారో గుర్తించి.. దాని మీద ఫోకస్ పెట్టండి.
కొన్ని సార్లు మన ఎమోషన్స్‌ను పూర్తిగా అంగీకరించాలి.
ఎమోషన్స్ ఎక్కువయినపుడు గుండెల నిండా గాలి పీల్చుకుని వదలండి.
ఆ ఎమోషన్స్‌ను ఎప్పుడు? ఎలా? వాడాలో నేర్చుకోండి.
మెడిటేషన్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.
ఇన్ని చేసినా ఎమోషన్స్‌ను బయటకు రాలేకపోతే.. థెరపిస్ట్‌ను సంప్రదించటం మంచిది.