రోజుకో గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి. అనే మాట ఊర్లో గుడ్లు అమ్మే వ్యాపారస్తుల స్లోగన్.
ఇక ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికి తెలిసిందే.
అయితే కోడిగుడ్డులో తెల్లటి భాగం ఎక్కువ తినాలా? పసుపు భాగం(నీలం) ఎక్కువ తినాలా?
ఈ ప్రశ్నలతో పాటుగా వారానికి ఎన్ని ఉడకబెట్టిన కోడి గుడ్లు తింటే మంచిదో అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఈ సందేహాల గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూట్రిషన్ వ్యాల్యూస్ ప్రకారం గుడ్డులోని తెల్లభాగంలో 3.6 గ్రా. పోట్రీన్ ఉంటుంది.
ఇక ఎల్లోలో 2.7 గ్రా. ప్రోటీన్స్ ఉంటాయి.
కొవ్వుల పరంగాచూస్తే.. వైట్ లో 0.05 గ్రా. ఫ్యాట్ ఉంటే..ఎల్లోలో మాత్రం 4.5 గ్రాముల కొవ్వులు ఉంటాయి.
కాలరీల పరంగా చూసుకుంటే వైట్ లో కంటే ఎల్లో ఎక్కువగా ఉంటాయి.
కాల్షియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు కూడా ఎల్లోలోనే ఉంటాయి.
అయితే ఎల్లోని ఎక్కువ తినడం మూలంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపునులు చెబుతున్నారు.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఎల్లోని తీసుకోకపోవడమే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
ఇలాంటి వారు వైట్ ను ఎక్కువగా తీసుకుంటే బాడీకి ప్రోటీన్స్ లభిస్తాయంటున్నారు న్యూట్రిషియన్ నిపుణులు.
అయితే డైట్ లో గుడ్డును చేర్చుకునే వారు వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే పూర్తి గుడ్డును తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
మిగిలిన రోజుల్లో కేవలం వైట్ ను మాత్రామే మీ ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
నోట్: పై చిట్కాలను పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.