చింతపండు, చింతకాయ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చింతపండు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

మలబద్ధకం ఉన్న వారు రాత్రి చింతపండు తిని పడుకుంటే.. ఉదయానికి సుఖ విరోచనం అవుతుంది. 

చింతపండు తినడం వల్ల జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. 

చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ శరీరంలో కొవ్వుని నిల్వనివ్వదు. 

ఈ కారణంగా బరువు తగ్గుతారు.

చింతపండులో ఉండే విటమిన్స్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

శరీరంలో ఉండే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్ ను ఇది నాశనం చేస్తుంది.  

దీని వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

చింతపండులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. 

పిల్లలకు కడుపులో పురుగులు పడితే చింతపండు తినిపిస్తే మంచిది. 

చింతపండులో ఉండే విటమిన్ బి, థయమిన్ కండరాలు, నాడుల పనితీరుని మెరుగుపరుస్తుంది.