నిమ్మ కాయతో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషమమే..

నిమ్మకాయను అన్ని రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగిస్తూనే ఉంటాము. 

ఆహారంలో.. చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఇలా అన్ని రకాలుగా నిమ్మకాయను వాడుతుంటాము. 

అయితే, నిమ్మ కాయ మాత్రమే కాదు.. నిమ్మ ఆకులు కూడా చాలా ఉపయోగాలను చేకూరుస్తాయి. 

నిమ్మ ఆకుల్లో యాంటీ వైరల్, ఆల్కలాయిడ్, యాంటీ ఆక్సిడెంట్, టానిన్, ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి.

నిమ్మ ఆకుల్లో ప్రోటీన్ కంటెంట్ తో పాటుగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా ఉంటాయి.

యాంథెల్మింటిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ-ఫ్లూలెన్స్, యాంటీ-క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఈ ఆకులు కలిగి ఉంటాయి.

నిమ్మ ఆకులను తగిన విధంగా వాడటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

నిమ్మ ఆకుల ద్వారా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

ప్రసుత కాలంలో నూటికి 90 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. 

నిమ్మ ఆకులతో నిద్రలేమి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. 

ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆల్కలాయిడ్లు నిద్రలేమి, నిద్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

బరువును తగ్గించటంలోనూ నిమ్మ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి.