చలన చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతో ఎంత పాపులారిటీ తెచ్చుకుంటారో.. మరో సినిమాతో పరిశ్రమకు దూరం అవుతుంటారు కొంత మంది నటీమణులు.

 చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలో కనిపిస్తున్నారు

ఆ తర్వాత సినిమా అవకాశాలు రాక లేదంటే మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టి చిత్ర పరిశ్రమ నుండి దూరం జరుగుతుంటారు. 

అటువంటి వారిలో ఒకరు చిరునవ్వుతో హీరోయిన్. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను, మాటలను అందించడం విశేషం. 

ఈ సినిమాతోనే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్  పరిచయమైనప్పటికీ.. తొలుత నువ్వేకావాలి విడుదలైంది. 

ఈ సినిమాతోనే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్  పరిచయమైనప్పటికీ.. తొలుత నువ్వేకావాలి విడుదలైంది. 

స్వయం వరంతో నటుడిగా పరిచయమై.. తొలి సినిమానే తన ఖాతాలో వేసుకున్న హీరో తొట్టెంపూడి వేణు. అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. 

ఆ తర్వాత మనస్సు పడ్డాను కానీ వచ్చింది..ప్లాప్ అయ్యింది. ఆ సమయంలో వచ్చిందే ఈ సినిమా. చిన్న సినిమా వచ్చిన.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఈ సినిమా నాలుగు నంది అవార్డులను కొల్లగొట్టడమే కాదూ.. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అయ్యింది. 

తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్‪గా నటించింది షహీన్ ఖాన్. హిందీ మినహా మిగిలిన మూడు భాషల్లో సంధ్య క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. 

ఈ సినిమాలో చాలా క్యూట్ లుక్స్‌తో నాజూగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేసింది.

 మోడల్ అయిన షహీన్.. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించింది. హీరోయిన్లకు గుర్తింపునిచ్చే యాడ్ ఫెయిర్ అండ్ లవ్లీలో కూడా మెరిసింది.

ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అందం. ఈ సినిమా కన్నడ రీమేక్ చేయగా.. అగ్ర నటుడు రవిచంద్రన్, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన నటించింది.

ఈ రెండు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో డార్లింగ్, డార్లింగ్ అనే మూవీలో చివరిగా కనిపించింది.  

అప్పటి నుండి ఏ సినిమాలో కనిపించలేదు. వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది

ఆమెకు ఓ కూతురు.  కానీ ఇప్పుడు చూసిన ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ఫిట్ నెస్, ఇతర విషయాలను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ.