చిన్న చిన్న పట్టణాలనుంచి పెద్ద పెద్ద నగరాల వరకు కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయాయి. బయటకు వెళితే దుమ్మ ధూళిని ఒంటికి అంటించుకోక తప్పదు. ఇక ఎండకాలం వచ్చిదంటే దుమ్మ, ధూళితో పాటు ఎండను కూడా భరించాల్సి వస్తుంది.
ఈ మూడింటి దెబ్బకు శరీరంలో ఎక్కువ ఇబ్బంది పాలైయ్యేది మన జుట్టు. బయట ఎంత ఎక్కువ తిరిగితే అంత పాడవుతుంది. ఇంట్లో ఉండేవాళ్ల పరిస్థితి బాగానే ఉంటుంది.
1. జుట్టును కప్పండి.. జట్టును కప్పి ఉంచటం ద్వారా ఎండలనుంచి మాత్రమే కాదు.. దుమ్మ, ధూళినుంచి కూడా రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా అతినీలలోహిత కిరణాలనుంచి జుట్టును కాపాడుకోవచ్చు.
2) ప్రతి రోజు తల స్నానం మానండి.. ప్రతి రోజు తల స్నానం చేయటం అన్నది మంచి పద్దతి కాదు. ఇలా చేయటం వల్ల తలలోని సహజ సిద్ధ నూనెల ఉత్పత్తి పెరిగిపోతుంది. సాంపూ వాడకాన్ని కూడా తగ్గించాలి. ఇంట్లో తయారు చేసిన సాంపూ వాడటం మంచిది.
3) చెక్క దువ్వెనతో దువ్వుకోండి.. జుట్టు తడిగా ఉన్నపుడు దువ్వటం మంచిది కాదు. జట్టును ప్లాస్టిక్ దువ్వెనలతో కాకుండా వాటి స్థానంలో చెక్క దువ్వెనలతో దువ్వటం ఉత్తమం. ఇలా చేస్తే మన కుదుళ్లలోని సహజ నూనెలు జుట్టు మొత్తానికి అందుతాయి.
4) వేడి నీళ్ల స్నానం వద్దు.. కొంత మంది ఎండాకాలంలో కూడా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. తలను కూడా వేడి నీటితోటే శుభ్రం చేస్తుంటారు. సాంపూ పెడుతుంటారు. ఇలా చేయటం వల్ల కుదుళ్లలోని సహజ నూనెలు కరిగిపోతాయి.
4) వేడి నీళ్ల స్నానం వద్దు.. తద్వారా సెబాషియమ్ గ్రంధులు సీబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. జట్టు జిడ్డుగా తయారవుతుంది. అందుకే.. చల్ల నీటితో స్నానం చేయటం మంచిది. కేవలం జుట్టునైనా చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి.
5) హెడ్ మసాజ్.. కొబ్బరి నూనె లేదా ఇతర నూనెలతో తలకు మసాజ్ చేయటం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగావంతంగా తయారవుతుంది.