రిషేంద్రభూషణ్‌ అలియాస్‌ ఇగో మాస్టార్‌ రిషి గురించి  తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

గుప్పెడంత మనసు సీరియల్‌ ద్వారా.. తెలుగు  ప్రేక్షకులకు చేరువయ్యాడు రిషి అలియాస్‌ ముఖేష్‌ గౌడ.

సీరియల్‌లో తల్లి ప్రేమకు దూరమైన వ్యక్తిలా అతడు  పలికే సంభాషణలు కంటతడి పెట్టిస్తాయి.

తండ్రి మహేంద్రతో కలిసి చేసే సీన్స్‌ చూస్తే.. అసలు వీళ్లు  నటిస్తున్నారా.. జీవిస్తున్నారా.. రియల్‌గా తండ్రి  కొడుకులు అనేట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు.

రీల్‌ లైఫ్‌లో తండ్రి మీద ఎంత ప్రేమ, బాధ్యతగా  ఉంటాడో.. వాస్తవ జీవితంలోనూ అలానే ఉంటాడు రిషి.

రిషి తండ్రి పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు.

సీరియల్స్‌లో చేస్తూ.. తాను ఎంత బిజీగా ఉన్నా సరే..  తండ్రికి అన్ని తానై.. కొడుకులా సేవలు చేస్తున్నాడు రిషి.

ఈ విషయాన్ని తాజాగా స్టార్ మా పరివార్ అవార్డ్స్  వేదికపై వెల్లడించాడు.

తండ్రికి అన్ని తానై.. కొడుకులా చూసుకుంటున్న  రిషి గురించి అందరికి తెలియజేశారు. 

ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని  చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు రిషి.

మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా  చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో ఇలా జరుగుతుందో  లేదో నాకు తెలియదు. కానీ నా జీవితంలో జరిగింది. 

నాన్నకు నేనే నాన్నను కావడం నాకు దక్కిన గొప్ప  అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రిషి భావోద్వేగానికి  గురయ్యాడు. 

రిషి తన తండ్రికి అన్నం తినిపిస్తూ.. గెడ్డం గీస్తూ..  ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించాడు. 

ముఖేష్‌ గౌడ మోడలింగ్‌తో కెరియర్ స్టార్ట్ చేశాడు.

ఈ క్రమంలో 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్  గెల్చుకున్నాడు. 

ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.  రిషి నటించిన తొలి సీరియల్‌ ‘నాగకన్నిక’. 

ఆ తర్వాత ‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్  పరిశ్రమలో అడుగుపెట్టాడు రిషి. 

ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్ర  ద్వారా.. తెలుగు ప్రేక్షకుల్ని.. తన అద్భుత నటనతో  ఆకట్టుకుంటున్నాడు రిషి.