ప్రజల రక్షణ, సమాజంలో అన్యాయాలను అరికట్టడం పోలీసుల బాధ్యత.

విధుల్లో భాగంగా పోలీసులు ప్రజలపై  కాస్త కఠినంగా వ్యవహరిస్తారు.

అందుకే పోలీసులపై ఓ రకమైన నెగిటీవ్ ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంటుంది.

పోలీసుల్లో కూడా మంచి మనస్సు, మానవత్వం దాగి ఉందనడానికి అనేక ఘటనలే నిదర్శనం.

ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్లి.. తీవ్ర అస్వస్థకు గురైన  ఓ విద్యార్థిని ఎస్సై కాపాడారు.  

గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్రవంతి అనే విద్యార్థిని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తుంది.

స్రవంతి చలి జ్వరంతో తీవ్ర బాధపడుతూనే ఇంటర్ పరీక్షకు హజరైంది.

జర్వంతో బాధపడుతున్న స్రవంతి తీవ్ర అస్వస్థతకులోనై కళ్లు తిరిగి పడిపోయింది.

వెంటనే స్పందించిన ఆత్మకూరు ఎస్సై శివశంకర్ స్రవంతిని తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పోలీస్ వాహనంలో స్రవంతిని దగ్గర్లోని ఓ  ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిచారు.

చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని తిరిగి పరీక్ష కేంద్రం వద్ద దింపడం  చేశారు.

ఆపదలో ఉన్న విద్యార్థిని కాపాడిన ఎస్సైకి యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

తనను కష్ట కాలంలో కాపాడిన  పోలీసులకు స్రవంతి ధన్యవాదాలు తెలిపింది.

అలానే ఎస్సై శివశంకర్ కి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి.

కఠినమైన ఖాకీ చొక్క వెనుకు మంచి మనస్సు ఉందని కొందరు కామెంట్స్ చేశారు.