మాములుగా ఉదయం నిద్రలేవగానే అందరూ చేసే పని బ్రష్ చేసుకోవడం.
అయితే చాలా మంది బ్రష్ చేసేటప్పుడు ఒక్కోరు ఒకలా చేస్తుంటారు. కానీ, ఉదయం బ్రష్ చేసేటప్పుడు ఈ చిన్న పని మర్చిపోవడం వల్ల చాలా ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
బ్రష్ చేసే ముందు చేయాల్సిన పని ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే తప్పక ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉదయం బ్రష్ చేసే సమయంలో కొందరు ముందుగా బ్రష్ ను నీటితో కడిగి ఆ తర్వాత దానికి పేస్ట్ పెట్టి దానిపై నీళ్లు పోసి పళ్లను శుభ్రం చేసుకుంటుంటారు.
మరి కొందరు మాత్రం, బ్రష్ ను శుభ్రం చేయకుండానే దానికి పేస్ట్ అంటించి ఆ తర్వాత పళ్లను శుభ్రం చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల పళ్లు దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు.
ఎందుకంటే? మనం బ్రష్ ను నీటితో కడగకుండా నేరుగా పేస్ట్ అంటించి పళ్లను శుభ్రం చేయడం ద్వారా ఎక్కువగా నురగా రాదు.
తద్వారా పళ్లను శుభ్రం చేసే క్రమంలో బ్రష్ కదలదు. మనమే బలవంతంగా రుద్దడం ద్వాకరా గట్టిగా రాపిడి జరుగుతుంది.
దీంతో చిగుళ్లు దెబ్బ తిని రక్తం వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు పంటి నొప్పి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవన్ని ఇబ్బందులు దరి చేరకుండా ఉండాలంటే మనం పళ్లు శుభ్రం చేసుకునే ముందు బ్రష్ ని నీటితో కడగాలి.
ఆ తర్వాత పేస్ట్ ను బ్రష్ కు అంటించిన తర్వాత నీళ్లు పోయాలి.
ఇలా చేయడం వల్ల బ్రష్ చేసేటప్పుడు ఎక్కువగా నురగ రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పళ్లను శుభ్రపరుచుకోవచ్చు.