వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి

కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి

మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.

కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.

నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.

రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. 

బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. 

చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.

రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం తాపిస్తే.. చిన్నపిల్లలకు మలబద్దకం పోతుంది

తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి