ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేల జీతం పొందే అవకాశం ఉంది.

అనుభవంతో పని లేదు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్  ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) కి చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో మొత్తం 4062 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంటర్ పాసైన వారిని నాన్ టీచింగ్ విభాగంలో ల్యాబ్ అటెండెంట్ గా భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 4062 ప్రిన్సిపాల్: 303 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 2226 అకౌంటెంట్: 361 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 759 ల్యాబ్ అటెండెంట్: 373

జీతభత్యాలు: ప్రిన్సిపాల్ కి: నెలకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200 వరకూ

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: నెలకు రూ. 47,600 నుంచి రూ. 1,51,100 వరకూ అకౌంటెంట్: నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకూ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: నెలకు రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకూ ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకూ

వయసు పరిమితి: ప్రిన్సిపాల్ పోస్టుకి అప్లై చేసేవారి వయసు 50 ఏళ్లకు మించకూడదు. 

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకి అప్లై చేసేవారి వయసు 40 ఏళ్లకు మించకూడదు అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకి అప్లై చేసేవారి వయసు 30 ఏళ్లకు మించకూడదు

ల్యాబ్ అటెండెంట్ పోస్టుకి అప్లై చేసేవారి వయసు 30 ఏళ్ల వరకూ అర్హులే.

దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపాల్ పోస్టుకి: రూ. 2000/- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకి: రూ. 1500/- నాన్ టీచింగ్ స్టాఫ్ కి: రూ. 1000/-

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో

దరఖాస్తు చివరి తేదీ: 31 జూలై 2023 రాత్రి 11:50 గంటల వరకూ

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్