ఈ రోజుల్లో చాలా మంది అధిక కారం, మాసాల కలగలిసిన వంటకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
మరికొంత మంది మాత్రం.. రోజూ మసాలతో నిండిన కూరలు తినేందుకు ఇష్టపడుతుంటారు.
అలా తరుచు కారం ఎక్కువగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అయితే తరుచు మనం కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?
అసలు కారం ఎక్కువగా తినడం ప్రమాదమేనా? వైద్యులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మందికి రోజులో ఒక్కసారైన ముక్కు లేనిదే ముద్ద దిగదు. దీంతో అధిక, ఉప్పు కారంతో కూడిన వంటకాలు తినేందుకు ఇష్టపడుతుంటారు.
అలా కారం ఎక్కువగా ఉండే కూరలు తినడం ద్వారా రోగాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
కారం ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవడం వల్ల కడుపులో ఎసీడీటీతో పాటు గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉందట.
ఎక్కువ కారంతో కూడిన ఆహార పదర్థాలు తినడం ద్వారా జీర్ణ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇదే కాకుండా కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అల్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.
గ్యాస్ సమస్యతో పాటు కడుపులో మంట కూడా వస్తుందట.
ఉప్పు, కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా డయేరియా ఎటాక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కారం, మసాల డీ ఫ్రై చేసిన ఆహార పదర్థాలు తీసుకోవడం ద్వారా పొట్ట లోపలి భాగంలో అతుక్కునే ప్రమాదం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఎంతకైన మంచిది కారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం అన్ని విధాలుగా మంచిదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.
నోట్: మాకు అందుబాటులోని సమాచారం ఆధారంగా పైన పాయింట్స్ చెప్పాం. నెటిజన్స్ గమనించగలరు!