మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతీ ఒక్కరూ రోగాల బారినపడి పడుతున్నారు.
ప్రధానంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో యుద్ధం చేస్తున్నారు.
ఇలాంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం ప్రతీ రోజూ మందులు వేసుకుంటుంటారు.
రోజులో దాదాపుగా రోజూ 5 నుంచి 8 టాబ్లెట్స్ వరకు వేసుకుంటూ ఉంటారు.
అలా వేసుకున్న వెంటనే ఓ గ్లాసు నీళ్లు తీసుకుంటుంటారు.
అసలు టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీళ్లు తాగడం కరెక్టేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఏదైన జ్వరంతో బాధపడినా కానీ మరేదైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఓ టాబ్లెట్ వేసుకుని కొంతమంది అసలు నీళ్లే తాగరు.
వేసుకుంది ఒకటే టాబ్లెట్ కదా ఎందుకు నీళ్లు ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తుంటారు.
అలా అస్సలు చేయొద్దని, అలా చేస్తే కడుపులో టాబ్లెట్స్ అరగకపోవడంతో పాటు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టాబ్లెట్ వేసుకున్నా.. ఓ గ్లాసు నీళ్లు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
కానీ కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మాత్రం 60 ML నుంచి 120 తాగాలని డాక్టర్లు చెబుతుంటారు.
అలా కాకుండా ఎన్ని టాబ్లెల్స్ వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక గ్లాసు మంచి నీళ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.