చాలా మంది అతిగా దాహం వేసినప్పుడు కానీ, లేక వేసవి కాలంలో వేడిని తట్టుకోవాడానికి తరుచుగా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.
కొబ్బరి నీళ్లే కదా అని చాలా మంది ఎక్కువగా తాగుతుంటారు.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కొబ్బరి నీటిని చాలా మంది తాగడానికి ఇష్టపడుతుంటారు.
ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగేవారికి మాత్రం నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా శరీరంలో పొటాషియం శాతం అమాంతంగా పెరిగిపోతుంది.
తద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది.
అధిక రక్తపోటు ఉన్నవారు సైతం కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి ఉన్నట్టుండి పడిపోయే అవకాశం కూడా లేకపోలేదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక నుంచైన కొబ్బరినీళ్లు మోతాదుకు మించి తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.