ఈ రోజుల్లో చాలా మంది అందంగా కనిపించేందుకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

మరీ ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ముఖం మరింత కాంతివంతంగా కనిపించేందుకు రోజూ మేకప్, లిప్ స్టిక్ లు వాడుతుంటారు.

ముఖ్యంగా లిప్ స్టిక్ వాడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 లిప్ స్టిక్ వాడిన తర్వాత అలాగే ఏదైన తిన్నా, తాగిన కొంత కడుపులోకి వెళ్తుంది.

 ఇందులో ఉండే అల్యుమినియం పొట్టలోకి వెళితే అది అల్సర్ కు దారి తీస్తుందని చెబుతున్నారు నిపుణులు.

 లిప్ స్టిక్ వాడడం వల్ల కంటి సమస్యలు, శ్వాస కోస సమస్యలు, ఉక్కిరి బిక్కిరి చేయడం వంటివి వస్తాయట.

ఇది వాడడం వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తుంది.

దీంతో పాటు గుండె సమస్యలు, హైపర్ టెన్షన్ వచ్చే ఆస్కారం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ లో దొరికే చవకైన లిప్ స్టిక్ లు వాడడం ద్వారా లేనిపోని చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ లిప్ స్టిక్ వాడాలనుకుంటే.. ముందుగా పెదాలపై లిప్ బామ్ రాసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ రాసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.