ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిష్టియన్‌ సోదరులు ఎంతో భక్తి భావంతో జరుపుకునే పండగల్లో క్రిస్మస్‌ ప్రధానమైనది.

ఈ పండుగ రోజు బహుమతులు ఇచ్చుకుంటూ మేరీ క్రిస్మస్‌ అని చెప్పుకోవటం పరిపాటి.

పండుగ రోజన ఒకరితో ఒకరు తమ సంతోషాన్ని పంచుకుంటారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

అయితే, కొన్ని చోట్ల హ్యాపీ క్రిస్మస్‌ అని మరికొన్ని చోట్ల మేరీ క్రిస్మస్‌ అని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

హ్యాపీ క్రిస్మస్‌, మేరీ క్రిస్మస్‌కు మధ్య తేడా ఏంటి? ఎందుకు ఎక్కువ మంది మేరీ క్రిస్మస్‌ అని విష్‌ చేస్తూ ఉంటారు.

ఇంగ్లాండ్‌లో క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పటానికి హ్యాపీ క్రిస్మస్‌ అని వాడతారు.

ఇక, చాలా ప్రాంతాల్లో మేరీ క్రిస్మస్‌ అంటూ శుభాకాంక్షలు చెబుతారు.

మేరీ, హ్యాపీ అనే పదాల మధ్య పెద్ద తేడాలేదు. 

రెండు పదాలు ఆనందాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించబడతాయి.

 అయితే, మేరీ అనే పదం ప్రజల భావాలను వ్యక్త పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

హ్యాపీ క్రిస్మస్‌ అనేది ఉన్నత వర్గాల పదంగా.. మేరీ క్రిస్మస్‌ అనే సాధారణ ప్రజల పదంగా తెలుస్తోంది.

1534 సంవత్సరం నుంచి మేరీ క్రిస్మస్‌ అనే పదాన్ని వాడుతున్నట్లుగా ఓ లేఖ ద్వారా తెలియవచ్చింది.