చాలా మంది యువతి, యువకులు తమ ముఖాలపై మచ్చలు, మెుటిమలు వస్తున్నాయని బాధపడుతుంటారు.
ఈ సమస్య కనిపించగానే వెంటనే మార్కెట్ లో దొరికే అన్ని క్రీమ్స్ ను వాడటం మెుదలుపెడతారు
ఇది అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముందుగా ఈ మచ్చలు, మెుటిమలు ఏ విటమిన్ లోపం కారణంగా ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి.
ఆ తర్వాత ఆ విటమిన్లకు సంబంధించిన ఆహారపదార్థాలను తీసుకోవడం మూలంగా మచ్చలు, మెుటిమల సమస్యల నుంచి దూరం కావొచ్చు అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12 లోపాల వల్లే ముఖంపై మచ్చలు, మెుటిమలు వస్తాయంటున్నారు నిపుణులు.
నిమ్మజాతికి సంబంధించిన పండ్లు తినడం వల్ల సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
ఈ విటమిన్ చర్మం నిగారింపునకు దోహదం చేస్తుంది.
ఇక ముఖంపై మచ్చలు రావడానికి మరో కారణం విటమిన్ డి లోపం.
దీని నివారణకు గుడ్లు, చేపలు, మాంసంతో పాటుగా సూర్యరశ్మి ని తీసుకోవాలి.
చర్మం నిగనిగలాడాలి అంటే కచ్చితంగా పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
శరీరంపై తెల్ల మచ్చలు రావడానికి విటమిన్ డి లోపమే కారణం.
మెలానిన్ అనేది చర్మం రంగుకు కారణం అవుతుంది.
ఇది ఎక్కువైతే చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. విటమిన్ ఇ తో ఈ లోపాన్ని అరికట్టవచ్చు.
ముఖంపై మచ్చలు, మెుటిమలు కనపడగానే కంగారుపడి మార్కెట్ లో దొరికే చెత్తా చెదారం లాంటి క్రీములు రాయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తుల ద్వారా ఈ లోపాలను సరిదిద్దుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.