లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెళ్లయినా సరే ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
కాతు వాక్కుల రెండు కాదల్, గాడ్ ఫాదర్ తో కలిపి మొత్తంగా ఆరు సినిమాలు చేసింది. రూ.15 కోట్ల పారితోషికం అందుకుందట.
ఈ ఏడాది ఐదు సినిమల్లో వర్క్ చేసిన నేషనల్ క్రష్ రష్మిక.. రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.
బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా హిందీలో రెండు, తెలుగులో మహేశ్ సినిమా చేస్తోంది. మరో రెండు ప్రాజెక్టులు చర్చలో దశలో ఉన్నాయట.
వీటితో మొత్తంగా రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.
ఈ ఇయర్ నాలుగు సినిమాలని ఒప్పుకొన్న ముద్దుగుమ్మ కీర్తిసురేశ్.. రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుందని టాక్.
యంగ్ సెన్సేషన్ కృతిశెట్టి.. ఈ ఏడాది నాలుగు సినిమాలకు సైన్ చేసింది. దీని ద్వారా రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోనుందని సమాచారం.
ఈ ఇయర్ రెండు సినిమాలు మాత్రమే చేసిన సమంత.. రూ.6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది భీమ్లా నాయక్, తిరు లాంటి సినిమాలు చేసిన హీరోయిన్ నిత్యామేనన్.. రూ.4 కోట్ల మేర పారితోషికం అందుకుందని సమాచారం.
ఇక యంగ్ హీరోయిన్ రాశీఖన్నా కూడా ఈ ఇయర్ 4 సినిమాలకు పైగా చేసింది. రూ.4 కోట్లపైనే పారితోషికం అందుకుందట.
మిల్కీ బ్యూటీ తమన్నా, ఈ ఏడాది మూడు సినిమాల్లో నటించింది. రూ. 3 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు, మలయాళ సినిమాలతో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్మీ.. ఆరు సినిమాలు చేసి రూ.3.5 కోట్ల మేర అందుకుందని సమాచారం.
ఇక ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. రూ.3 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్.. ఈ ఏడాది 'కార్తికేయ 2' లాంటి పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేసింది. మరో మూడు సినిమాల్లోనూ కనిపించి రూ. 2 కోట్ల పారితోషికం దక్కించుకుందట.
తమిళ డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన ప్రియాంక మోహన్.. నాలుగు సినిమాల్లో నటించి రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ సొంతం చేసుకుందని సమాచారం.
ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి బడా హీరోలతో చేస్తున్న శ్రుతిహాసన్.. రూ.3 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.
ఈ ఇయర్ రెండు సినిమాలు చేసిన త్రిష.. రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
నోట్: సోషల్ మీడియాలో దొరికిన సమాచారం పైన విషయాలు చెప్పాం. గమనించగలరు!