ఆరోగ్యం.. ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆకుకూరలు తినాలని చెబుతుంటారు వైద్యులు. వాటిల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఆకు కూరల్లో ప్రధానంగా వినిపించే పేర్లు.. తొటకూర, పాల కూర. తొట కూర సంగతి అలా ఉంచితే! పాల కూర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలోనే పాలకూర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు రావు.. ఆకు కూరల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. పాల కూరలో క్యాల్షియంతో పాటు.. విటమిన్-కె కూడా ఉంటుంది. 

 ఈ రెండు కూడా ఎముకలు గట్టిదనానికి ఉపయోగపడతాయి.

గుండెకు మంచిది.. పాలకూరలో నైట్రేట్ ఉండటంతో.. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. 

బ్లడ్ ప్రజర్ ను తగ్గించి, గుండె పనితీరును మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత ఉండదు.. అనీమియా వ్యాధితో బాధపడే వారికి పాలకూర ఓ ఔషదంగా పనిచేస్తుంది. 

ఈ సమస్యతో బాధపడేవారు పాలకూరను తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది.

బరువు పెరగరు.. పాలకూరను ఎంత తిన్నాగానీ బరువు పెరగరు. ఎందుకంటే? పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా ఏం కాదు.

పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా ఏం కాదు.

గర్భిణీలకు మంచిది.. గర్భిణీలు పాలకూరను తీసుకోవడం వల్ల బిడ్డకు వెన్నముక సమస్య రాదు. 

అలాగే బేబీ మెదడు ఎదుగుదలకు కూడా పాలకూరలోని పోషకాలు సహాయం చేస్తాయి.