తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం పోవాలనుకునే వారికి మంచి వాహన సదుపాయం రైలు. కానీ ఇప్పుడు రైలులో ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దానికి కారణం ఒడిశాలోని జరిగిన పెను విషాదం. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 300 మంది మృత్యువాత పడ్డారు. 800 మంది ఆసుపత్రిలో గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

వీరిలో 100 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే  ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 రైల్వేలో సిగ్నలింగ్ వ్యవస్థ చాలా కీలకమైనది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందీ అల్యూమినియం బాక్సుల గురించి.

రైలులో ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన  ఒక్కసారైనా కూర్చుని బయట పరిసరాలను పరిశీలిస్తూనే ఉంటాం.

వంపులు వంపులు తిరిగే రైళ్లను చూస్తాం. రైళ్ల క్రాసింగ్, పట్టాల క్రాసింగ్ వంటివి చూస్తుంటాం. 

అలాగే రైల్వే ట్రాకుల పక్కన ఒక అల్యూమినియం బాక్సులను చాలా సార్లు గమనించే ఉంటాం. 

అయితే ఇప్పుడు ఇది ఎందుకు పెడతారో అన్న అనుమానం కలుగుతుంది కానీ.. దేనికి ఉపయోగిస్తారన్నఆలోచనలో ఉండిపోతాం.

అసలు ఆ బాక్సును అక్కడ ఎందుకు అమరుస్తారో తెలుసుకుందాం.. ఈ రైల్వే ట్రాకుల వెంబడి అమర్చే ఈ అల్యూమినియం బాక్సులను ఆక్సిల్ కౌంటర్ బాక్సులు అంటారు. 

ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి మూడు నుండి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రాకులకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి.

ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి మూడు నుండి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రాకులకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి.

వీటిని లోకేషన్ బాక్సులు అని కూడా అంటారు. ఇవే ప్రయాణీకులకు భద్రతను కల్పించే సాధనాలు. ఎలా అనుకుంటున్నారా..?

ఈ బాక్సులే రైళ్ల రాకపోకలకు ప్రధాన వాహకాలు. వచ్చే, పోయే రైళ్ల సమాచారాన్ని రైల్వే శాఖకు చేరవేస్తాయి. 

అల్యూమినియం బాక్సులో ఓ డివైస్ ఉంటుంది. ఈ డివైస్‌కు రైలు పట్టాల మధ్య ఉండే మరో డివైస్‌తో అనుసంధానం ఉంటుంది.

రైలు పట్టాల మధ్య ఉండే డివైస్ పట్టాల మీద నుంచి రైళ్లు వెళ్ళినపుడు ఆ రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో గుర్తిస్తుంది.

సాధారణంగా రైలు చక్రాలకు మధ్య ఆక్సిల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క బోగీకి లొకేషన్ బాక్స్‌కు పంపిస్తుంది. 

ఈ ఆక్సిల్స్‌‌ను బట్టి ఎన్ని బోగీల రైలు పట్టాల మీద నుంచి వెళ్ళింది అనే సమాచారాన్ని ఈ అల్యూమినియం బాక్స్ సేకరిస్తుంది. 

ఈ సమాచారాన్ని..తదుపరి అల్యూమినియం బాక్స్‌‌కి పంపిస్తుంది. ఇలా ప్రతి అల్యూమినియం బాక్సులు పనిచేస్తాయి. 

ఒకవేళ రావాల్సిన బోగీల కంటే తక్కువ బోగీలు వస్తే.. వెంటనే తదుపరి బాక్సుకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది.   వెంటనే అధికారులు అప్రమత్తమై రైలును నిలిపివేస్తారు. 

యాక్సిల్ కౌంటే కాకుండా, రైలు వేగాన్ని, దిశను కూడా తెలియజేస్తుంది