ఏదైన ఒక విషయంపై విజయం సాధించాలంటే ఏకాగ్రత అవసరం.

ఏదైన ఓ విషయంపై దృష్టి కేంద్రీకృతం చేయడం కూడా అత్యవసరం.

అయితే అలా ఓ విషయంపై  కొందరు దృష్టి కేంద్రీకృతం చేయలేకపోతుంటారు. 

మీకు అలానే ఓ పనిపై దృష్టి కేంద్రీకృతం అవ్వట్లేదా? మతిమరుపు పెరిగిపోతుందా? 

ఇలాంటి స‌మ‌స్యల‌కు చ‌క్కటి ప‌రిష్కారం క్యాండిల్ ట్రిక్. 

దీనిని మీ పిల్లల‌తో రెగ్యుల‌ర్ గా ప్రాక్టీస్ చేయిస్తే మీ పిల్లల జ్ఞాపక మార్పు వ‌స్తుంది. 

ఈ కొవ్వొత్తుల ఐడియాను పిల్లలకే  పెద్దలు కూడా పాటించ‌వ‌చ్చు. 

దీంతో మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అయితే ఇందుకు ఏం చేయాలంటే..

ఉద‌యం ప‌ద్మాస‌నంలో కూర్చొని మ‌న కంటికి స‌మాన‌మైన దిశ‌లో వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి.

మారుతున్న దాని మంట రంగు, గాలి వలన క‌దులుతూ త‌న షేప్ ను మార్చుకుంటున్న తీరును గమనించాలి.

అలా ఓ ఐదు నిమిషాల పాటు త‌దేకంగా ప‌రిశీలిస్తూ ఉండాలి.

కొద్ది సమయం తర్వాత వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి క‌ళ్లు మూసుకొసుకోవాలి.

కళ్లు మూసుకున్న అనంతరం ఇంత‌కు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్నట్టు ఊహించుకుకోవాలి.

ఇలా ప్రతిరోజు చేస్తూ మొద‌టి రోజు వెలుగుతున్న కొవ్వొత్తిని చూసిన సమయాన్ని క్రమంగా త‌గ్గించుకుంటూ పోవాలి. 

ఇలా చేయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తితోపాటు ఊహాశ‌క్తి కూడా బాగా పెరుగుతుందంట. 

ఇలా కొవ్వొత్తుల ప్రయోగం  ద్వారా చిన్నారుల‌లో మెద‌డు విక‌సిస్తుంది. 

అదే విధంగా పెద్దల్లో వ‌చ్చే మ‌తిమ‌రుపు స‌మ‌స్యకు  కూడా కొవ్వొత్తి ట్రిక్ తో చెక్ పెట్టవ‌చ్చు.