కరోనా మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్యంపై స్పృహ బాగా పెరిగిపోయింది. హెల్త్ కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా చాలామంది హెర్బర్ టీలు తాగుతుంటారు. అయితే వాటిల్లో చెప్పుకోదగ్గది మాత్రం శంఖపుష్పి టీ. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.
ఈ టీకి ఉపయోగించే పువ్వులు కూడా మన ఇంటిచుట్టూ పక్కనే దొరికేస్తాయి.
మన పెరట్లోనూ ఈ మొక్కలు పెరుగుతాయి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసా?
శంఖపుష్పీ టీకి కావాలిసిన పదార్థాలు.. శంఖపుష్పి పువ్వులు(నీలం రంగువి)- 4 లేదా 5, నీళ్లు- కప్పున్నర, నిమ్మకాయ రసం- అర టీస్పూన్, తేనె- అర టీస్పూన్
శంఖపుష్పి టీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్లు మరగించాలి. ఇది జరుగుతున్నప్పుడే అందులో పువ్వులు వేయాలి.
దీంతో నీళ్లు నీలంగా మారుతాయి. ఇలా 2 నిమిషాల పాటు మరగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టాలి.
లభించిన మిశ్రమంలో నిమ్మరసం, తేనె కలపాలి. దీంతో శంఖపుష్పి టీ తయారవుతుంది. దీన్ని గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి.
శంఖపుష్పి టీని రోజుకు ఓసారి తాగితే.. మనకు చాలా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీన్ని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
శరీరం అంతర్గతంగా శుభ్రం కావడంతో పాటు బాడీలోని ఎన్నో చెడు వ్యర్థాలు బయటకు పోతాయి.
మీకు తలనొప్పి బాధిస్తుంటే.. ఈ టీ తాగడం వల్ల అది తగ్గిపోతుంది. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి.
శంఖపుష్పి టీ వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు నుంచి సురక్షితంగా ఉండొచ్చు.
గాయాలు, పుండ్లు అయినవారు ఈ టీని రోజూ తాగడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.
నోట్: పైన చెప్పిన టిప్స్ ఫాలో అయ్యే ముందు.. డాక్టర్స్, నిపుణుల సలహా కూడా ఓసారి తీసుకోండి.