ఏ కూరగాయలు కోసినా గానీ రాని కన్నీళ్లు ఉల్లిపాయలు కోసినప్పుడు మాత్రం వస్తాయి. 

చెఫ్ లకి మాత్రం కన్నీళ్లు రావు. చెఫ్ లు కాకుండా ఇంకెవరు ఉల్లిపాయలు కోసినా కన్నీళ్లు తప్పవు.

చెఫ్ లకి కన్నీళ్లు రాకుండా ఏం చేస్తారు? ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకోండి.

ఉల్లిపాయల్లో సిన్-ప్రొపేనేథియల్-ఎస్-ఆక్సైడ్ అనే రసాయనం ఉంటుంది.

ఇది కళ్ళలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. అందుకే ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు వస్తాయి.

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని చెఫ్ నిపుణులు చెబుతున్నారు.

మామూలు చాకుతో కంటే బాగా పదునుగా ఉండే చాకుతో ఉల్లిపాయలను కోస్తే కన్నీళ్లు తక్కువ వస్తాయని అంటున్నారు.

అసలు కన్నీళ్లే రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను పైభాగాన్ని కత్తిరించాలి.

ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే సల్ఫ్యూరిక్ సమ్మేళనం నీటిలో చేరుతుంది.

20 నిమిషాల తర్వాత నీటిలో నానిన ఉల్లిపాయలను కట్ చేస్తే కళ్ళలోంచి నీళ్లు రావు.

చెఫ్ లందరూ పాటించే పద్ధతి ఇదే. అందుకే వారి కళ్ళలోంచి నీళ్లు రావు.

మరి మీరు కూడా ఈ చిట్కాని పాటించేయండి.