పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు.
అయితే అతిగా తింటే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుందని అంటారు.
ఏదైనా అతిగా తినకూడదు. అలానే పండ్లని కూడా అతిగా తింటే అనారోగ్యం తప్పదని అంటున్నారు.
పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
ఈ కారణంగా శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగా అందవు.
జీర్ణక్రియను ప్రభావితం చేసి.. అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే పండ్లను విడిగా తినాలి.
నిద్రపోవడానికి 2, 3 గంటల ముందు ఏమీ తినకుండా ఉండడమే మంచిది.
అంటే తిన్న తర్వాత కనీసం 2 గంటలైనా గ్యాప్ ఉండాలి. పండ్లు అయినా సరే నిద్రపోవడానికి 2,3 గంటల ముందే తినాలి.
పడుకునే ముందు పండ్లను తినడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో చక్కెరను విడుదల చేస్తుంది.
రాత్రిపూట పండ్లు తినడం వల్ల పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. ఎసిడిటీ సమస్య బాధిస్తుంది.
సాయంత్రం పూట స్నాక్స్ లా పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. పిల్లలైనా, పెద్దలైనా వెంటనే నీళ్లు తాగకండి.
పుచ్చకాయలు, దోసకాయలు, నారింజ, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.
కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు ఆమ్లతను తగ్గిస్తాయి. దీని వల్ల పీహెచ్ సమతుల్యతలో మార్పులు కలుగుతాయి.
దీని వల్ల డయేరియా, కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం వైద్యులను, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.