పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది.
వేరే హీరోల సంగతేమో గానీ పవన్ కోసం ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా సరే వెళ్తామనే స్థాయిలో అభిమానం చూపిస్తుంటారు.
పవర్ స్టార్ సినిమా అనే కాదు, ఆయన నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' చిత్రాలతో ఎంటర్ టైన్ చేసిన పవన్.. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు.
వాటిలో 'హరిహర వీరమల్లు' కొన్నేళ్ల క్రితం మొదలైనప్పటికీ.. ఇంకో 40 శాతం కంప్లీట్ చేయాల్సి ఉంది. అది మరో 2-3 నెలల్లో పూర్తి కానుందట.
ఇదే కాదన్నట్లు హరీశ్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ తో 'OG' సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ పూజా కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయాయి.
ఇక తాజాగా 'అన్ స్టాపబుల్' షోలోనూ పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఫ్యాన్ కు ఐ ఫీస్ట్ ఇస్తూనే, తనపై విమర్శలు చేసే పలువురికి కౌంటర్స్ కూడా వేశారు.
ఫ్యాన్స్ వల్ల అప్పుడప్పుడు చిక్కులొచ్చి పడుతుంటాయి కదా. అలా ఇప్పుడు కూడా ఓ సమస్య ఎదురైంది. సోషల్ మీడియాలో దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
అయితే ఏమైందో ఏమో గానీ పవన్-రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ విషయంలో ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఒకటి రెండు రోజుల నుంచి ట్విట్టర్ లో ఇది జరుగుతుంది. ఇప్పుడీ విషయమై స్పందించిన దర్శకుడు సాయిరాజేష్, ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు.
'గత ఏడాదిగా, క్షణం తీరిక లేకుండా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ, కల్యాణ్ గారు ఇన్ని సినిమాలు చేయడానికి కారణం జనసేన ఆర్థికంగా బలంగా లేకపోవడమే'
'సినీ పరిశ్రమలో ఓ సైడ్ తీసుకోకూడదనే నాలాంటి వాళ్ల కోసం.. ఆయన కష్టం చూసి 'జల్సా' స్పెషల్ షోస్ మా వంతుగా చేశాం.'
'మీరు(ఫ్యాన్స్) మంచి చేయకపోయినా పర్లేదు. ఆయనకు, పార్టీకి హాని చేయకండి. సినిమాలు మాత్రమే చూసుకుని ఉండండి'
'ఫ్యాన్ వార్ లో తాత్కాలిక గెలుపు కోసం ప్రయత్నిస్తే, చాలామంది మనుషుల్లో కల్యాణ్ గారిపట్ల, పార్టీ పట్ల శాశ్వతమైన శత్రుత్వం కలిగిస్తున్నారు.'
'ఇక ఆపేయండి. పుల్ స్టాప్ పెట్టేయండి. మీరు మాత్రం గొడవలకు దూరంగా ఉండండి. ఇక్కడ ఎవరూ తగ్గేది లేదు, పెరిగేది లేదు' అని సాయిరాజేష్ ట్వీట్ చేశారు.