డబ్బుల విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని చూస్తుంటాం.
కొంత మంది మనీని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారు.
ఇలాంటి వాళ్ల సంపాదనను పక్కనబెడితే.. ఉన్న ఆస్తి మిగిలితే చాలు అనేలా ఉంటుంది పరిస్థితి.
కానీ కొందరు మాత్రం డబ్బుల విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యహరిస్తారు.
డబ్బుకు గౌరవం ఇచ్చేవారికే దాని విలువ తెలుస్తుంది. అలాంటి వాళ్లే ధనార్జనలో ముందుంటారు కూడా అని నిపుణుల చెబుతున్నారు.
ముఖ్యంగా జీవితంలో దిగువ స్థాయి నుంచి ఎదిగిన ప్రముఖులను చూసుకుంటే.. వారు ఎంత సంపాదించినా ఒదిగే ఉంటారు.
డబ్బును ఎక్కడ, ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో తెలియడంతో పాటు దాన్ని రెట్టింపు చేసే విద్య కూడా తెలిసి ఉండాలి.
దీంట్లో ఒక ఇండో-అమెరికన్ బిజినెస్‌మన్ ఆరితేరారు.
ఆ బిజినెస్‌మన్ పేరు ధర్మేష్ షా. హబ్స్పాట్ అనే సంస్థను 2006లో నెలకొల్పారాయన. దీంట్లో ఒక ఇండో-అమెరికన్ బిజినెస్ మన్ ఆరితేరారు.
బ్రియాన్ అల్లిగన్ అనే వ్యక్తితో కలసి హబ్స్పాట్ను మొదలుపెట్టారు ధర్మేష్.
ప్రస్తుతం హబ్స్పాట్ సంస్థ విజయవంతంగా నడుస్తోంది. సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలను ఈ కంపెనీ చూసుకుంటోంది.
హబ్స్పాట్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు ఆన్స్టార్టప్స్.కామ్ అనే వెబ్సైట్లో బ్లాగ్లు కూడా రాస్తుంటారు ధర్మేష్. ఇందులో ఆయనకు ఉన్న సబ్స్క్రయిబర్ల సంఖ్య 9 లక్షలుకు పైమాటే అని చెప్పొచ్చు.
ధనార్జనలో ధర్మేష్ టాప్ లెవల్లో ఉన్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.8,200 కోట్లు అని తెలుస్తోంది.
ధనార్జనలో ధర్మేష్ టాప్ లెవల్ లో ఉన్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ రూ.8,200 కోట్లు అని తెలుస్తోంది.
చాట్.కామ్ అనే డొమైన్ నేమ్ కోసం ఏకంగా రూ.82 ఖర్చు పెట్టారు ధర్మేష్.
అయితే కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువ రేటుకు ఆ డొమైన్ నేమ్‌ను ఇతరులకు అమ్మేశారు ధర్మేష్.
డొమైన్ నేమ్ అమ్మకం ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి రూ.2 కోట్లను ఖాన్ అకాడమీ అనే సంస్థకు విరాళంగా ఇచ్చారు ధర్మేష్.
దీంతో అందరూ ఈ వ్యాపారవేత్తను అభినందిస్తున్నారు.