మనిషికి సరిపడా నిద్ర ఉన్నప్పుడే.. శరీరం యాక్టీవ్ గా ఉంటుంది. లేదంటే ఎక్కడా లేని లేజీనెస్ బాడీని ఆవరిస్తుంది.

దాంతో మనం ఏ పనీ సరిగా చేయలేం. అందుకే డాక్టర్లు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి అంటారు.

ఐతే చాలా మంది రాత్రి పూట నిద్ర పట్టడం లేదంటూ.. చెప్తుంటారు. నిద్ర పట్టక పోవడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమే అంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలోనే మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలే నిద్రరావడానికి సహాయపడతాయని, పోషకాల లోపం ఏర్పడితే.

రాత్రి సరిగా నిద్ర పట్టదని న్యూట్రిషియాన్ నిపుణురాలు నవమి అగర్వాల్ పేర్కొంటున్నారు.

నిద్ర లేమికి కారణం ఈ క్రింది పోషకాలు శరీరంలో లోపించడమే అని ఆమె సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్-డి విటమిన్ డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ డి బాడీలోని ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 

ఇది గనకు బాడీలో లోపిస్తే.. రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టదు.

మెగ్నీషియం మెగ్నీషియం శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 

మెగ్నీషియం బాడీలో లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుందని నవమి అగర్వాల్ తెలిపారు.

 కాల్షియం శరీరంలో కాల్షియం లోపిస్తే కూడా నిద్ర సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. 

అందుకే కాల్షియం ఎక్కువగా లభించే పాలు, పెరుగు వంటి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

విటమిన్ బి12 బాడీలో విటమిన్ బి12 లోపిస్తే కూడా నిద్రలేమి సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్ నవమి అగర్వాల్. 

అందుకే గుడ్లు, చికెన్, చేపలు లాంటి ఆహారాన్ని తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు.