బుల్లితెరపై థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌తో సాగిపోయిన టెలివిజన్ సిరీస్ సిఐడి. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది.

ప్రముఖ టెలివిజన్ సంస్థ మాటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ చూడని వారు ఉండరు. 

ప్రతి ఎపిపోడ్ క్రైమ్ జరిగి.. నేరస్థుడు కనిపెట్డడంతో ఎసీపీ ప్రద్యుమ్న బృందం తలమునకలు అవుతుంది. ఎపిసోడ్ చివరిలో నిందితుడిని పట్టుకుంటుందీ బృందం.

ఇది ఎంత పాపులర్ అయ్యిందంటే బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఈ సిరీస్‌లో కనిపించి సందడి చేశారు. 

ఈ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా చాలా మంది చూస్తూనే ఉన్నారు. సీరియల్‍కే కాదూ ఇందులో నటించిన నటీనటులకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.

 ఏసీపీ ప్రద్యుమన్‌గా శివాజీ సతం, సీనియర్ ఇన్‌స్పెక్టర్ అభిజీత్‌గా ఆదిత్య శ్రీవాస్తవ, సీనియర్ ఇన్‌స్పెక్టర్ దయాగా దయానంద్ శెట్టి ప్రధాన పాత్రలు కాగా,

ఇన్‌స్పెక్టర్ ఫ్రెడ్రిక్స్ అలియాస్ ఫ్రెడ్డీగా దినేష్ ఫడ్నిస్, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఆర్కే సలుంఖేగా నరేంద్ర గుప్తా, అతడి అసిస్టెంట్ డా. తారికగా శ్రద్ధా ముస్కలే ముఖ్య తారాగణం.

ఆ తర్వాత ఎపిసోడ్లు పెరిగే కొద్ది కొత్త వారు ఇందులో భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అందులో భాగంగానే వచ్చారు ఇన్ స్పెక్టర్ వివేక్. 

చాలా ఎపిసోడ్లలో కనిపించాడు కూడా. ఇప్పుడు ఇతడి గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

CIDలో ఇన్‌స్పెక్టర్ వివేక్ పాత్ర పోషించిన నటుడు అసలు పేరు వివేక్ మష్రూ. ఇప్పుడు అతడు నటనకు దూరమై.. మరో వృత్తిని చేపట్టారు.

ఓ ట్విట్టర్ యూజర్ అతడి ఫోటోను షేర్ చేస్తూ ‘ఈయనను గుర్తు పట్టారా, బాల్యమెంతో అద్భుతంగా ఉండేది కదా’అని ఈ సీరియల్‌ను పిల్లలు ఎంత ఇష్టపడేవారో ట్వీట్ ద్వారా చెప్పారు. 

ఈ ట్వీటును రీ ట్వీట్ చేసిన మోనికా శర్మ అనే యూజర్ ‘ఇతడు మా సోదరుని కాలేజీ ప్రొఫెసర్. ఇది నిజం’అంటూ పేర్కొంది.

దీంతో ఆయన ఎక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు.

వివేక్ బెంగళూరులోని సిఎంఆర్ విశ్వవిద్యాలయంలో  డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామన్ కోర్ కరికులమ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. కాగా, వివేక్ కూడా ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. 

నేను చేస్తున్న చిన్న పనికి ఇంత ప్రేమ చూపిస్తూ, ప్రశంసిస్తున్నందుకు ధన్యవాదాలు. 

ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.  ఎల్లప్పుడూ మీ ప్రేమకు కృతజ్ఞతలు’అంటూ ట్వీట్ చేశారు వివేక్.