వాతావరణ ఎంతో అహ్లాదంగా ఉందనిపించినా మరోక వైపు పిల్లలలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
ఆస్థమా రావడం, చెవులలో ఇన్ఫెక్షన్, దీర్ఘకాలపు దగ్గు, పొడిబారి దురదలు వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ చలి కారణంగా వారి ముక్కుల నుండి రక్తం రావడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
అయితే ఈ సమస్యల నుంచి పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు ఈ టిప్సి బెటర్...
పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం.
సాధారణ జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు పసుపు కలిపిన పాలు మంచి ఉపశమనం అందిస్తుంది
వేడి వేడి సూప్, పండ్ల రసాలు శరీరం కోల్పోయిన శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి.
ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ఇవ్వవచ్చు.
జలుబు కారణంగా శ్వాస సమస్యలకు పరిష్కారానికి ఆవిరి చక్కగా ఉపయోగపడుతుంది.
పిల్లకు వేడి నీటితో స్నానం చేసినా మంచి ఉపశమనం పొందవచ్చు.
ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్ లు వంటివి రుద్దడంతో చర్మం సమస్యలకు తగ్గుతాయి.
చర్మం పొడిబారకుండా వైపరైజర్స్ లేదా హుమిడిఫైయర్స్ తో గాలిలో తేమ ఉండేలా చూసుకోవాలి.
ఇలా మరి కొన్ని టిప్స్ పాటించడం వల్ల చలికాలంలో వచ్చే సమస్యల నుంచి పిల్లలను కాపాడవచ్చు.