ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.
ఆరోగ్యాని కాపాడుకునే విషయంలో అనేక రకాల ఆహార పదార్ధలు తీసుకుంటున్నారు.
అయితే ఆహారాన్ని అందరు ఒకే పద్ధతిలో స్వీకరించరు.
కొందరు చేపలు తిన్న తరువాత పాలు తాగే అలవాటును కలిగి ఉంటారు.
చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల తెల్లమచ్చలు వస్తాయానే ప్రచారం సాగుతుంది.
దీని వెనుక ఏదైనా శాస్త్రీయ సత్యం ఉందా? అనేదానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతుంటాయి.
చేపలు తిన్న తర్వాత పాలు తాగడం హానికరమని ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.
చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల తెల్లమచ్చలు వస్తాయానేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు.
నేటి కాలంలో పాలతో తయారుచేసిన చేపల వంటకాలు చాలా ఉన్నాయి.
వాటిని తినడం వల్ల ఎలాంటి చర్మ అలెర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు రావు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా పిగ్మెంటేషన్ వల్ల తెల్ల మచ్చలు వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే, మీకు లాక్టోస్ సమస్య ఉంటే.. చేపలు తిన్న తర్వాత, అలెర్జీలు, వాంతులు, కడుపు నొప్పి సంభవించవచ్చు.
చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని ఎవరైనా చెబితే భయపడకండి.
పాలు, చేపలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఈ రోజు వరకు నిరూపించబడలేదు.
ఇంకా చెప్పాలంటే ఇవి రెండు మన ఆరోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి..
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం వైద్యులను, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.