గజం స్థలం కొనాలంటే రూ. 45 వేల నుంచి రూ. 50 వేలు అవుతుంది. ఇక 150 గజాల స్థలం కొనాలంటే 67 లక్షల నుంచి 75 లక్షలు అవుతుంది.
అదే కూకట్ పల్లి నుంచి ఒక 15 కి.మీ. ప్రయాణిస్తే బౌరంపేట్ వస్తుంది.
ఇక్కడ చదరపు అడుగు స్థలం రూ. 2,889 ఉంది. అంటే గజం రూ. 26 వేల నుంచి ఉన్నాయి.
150 గజాల స్థలం కొనాలంటే రూ. 39 లక్షలు అవుతుంది. 300 గజాలకు రూ. 78 లక్షలు అవుతుంది.
బౌరంపేట్ లో 150 నుంచి 300 గజాలు చొప్పున స్థలాలను విక్రయిస్తున్నారు.
ఇదే ఏరియాలో గరిష్టంగా గజం రూ. 45 వేలు కూడా ఉంది. చదరపు అడుగు రూ. 3300 నుంచి రూ. 4900 రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఈ ఏరియాలో 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే రూ. 20 లక్షల నుంచి 30 లక్షలు అవుతుంది.
550 నుంచి 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 బీహెచ్కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ కావాలంటే చదరపు అడుగుకు రూ. 2500 చొప్పున రూ. 18,75,000 అవుతుంది. రూ. 3750 చొప్పున ఐతే రూ. 28,12,500 అవుతుంది.
గుండ్లపోచంపల్లికి 4 కి.మీ, బాచుపల్లి నుంచి 5 కి.మీ, గండిమైసమ్మ నుంచి రూ. 6 కి.మీ, మియాపూర్ కి 12 కి.మీ, కూకట్పల్లి, హైదర్ నగర్ ఏరియాలకు 15 కి.మీ దూరంలో బౌరంపేట్ ఏరియా ఉంది.
హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకి 20 కి.మీ దూరంలో ఉంది. రూ. 39 లక్షల బడ్జెట్ లో 150 గజాల స్థలం, 30 లక్షల బడ్జెట్ లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.
అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.