హీరో, సెలబ్రిటీ, స్టార్స్‌ వీళ్లకు సమాజంలో ఉన్న మరో పేరే ఇన్‌ఫ్లూఎన్సర్స్‌. అంటే ప్రభావితం చేసే వ్యక్తులు అనమాట.

అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలతో ఎండార్స్‌ మెంట్లు చేయిస్తుంటాయి.

అయితే ఆ సో కాల్ట్‌ ఇన్‌ ఫ్లూఎన్సర్స్‌ ఎలాంటి వస్తువు/ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న.

ప్రజలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ చేసిన, చేస్తున్న వారి లిస్ట్‌ చూద్దాం.

అమితాబ్‌ బచ్చన్ ఓ పాన్ మసాలా యాడ్ చేశారు. తర్వాత వ్యతిరేకత రావడంతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారు.

గతంలో  సంజయ్ దత్ కూడా ఓ పాన్ మసాలా యాడ్‌ చేశాడు.

షారుక్‌ ఖాన్‌ అయితే విమల్‌ అనే పాన్ మసాలా యాడ్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు.

అజయ్ దేవ్ గణ్ కూడా షారుక్ ఖాన్‌ తో కలిసి పాన్ మసాలా యాడ్‌ లో చేశాడు.

సల్మాన్ ఖాన్‌ కూడా ఇందుకు అతీతుడేమీ కాదు. సల్లూ భాయ్ కూడా పాన్ యాడ్‌ చేసినవాడే.

సైఫ్ అలీ ఖాన్ గతంలో ఓ పాన్ మసాలా కంపెనీని ప్రమోట్ చేశాడు.

హెల్త్‌ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే టైగర్ షార్ఫ్ పాన్‌ మసాలాను ప్రమోట్‌ చేయడం గమనార్హం.

అక్షయ్ కుమార్ కూడా విమల్ ఇలైచీ యాడ్ చేసి విమర్శలకు గురయ్యాడు. ఇకపై అలాంటి యాడ్స్ చేయనని ప్రకటించాడు.

హృతిక్ రోషన్‌ కూడా పాన్ మసాలా యాడ్ లో నటించాడు.

రన్ వీర్ సింగ్- అమితాబ్ బచ్చన్‌ తో కలిసి పాన్ మసాలా యాడ్ చేశాడు. ఆ యాడ్ నుంచి బిగ్ బీ తప్పుకున్నాడు.