ఒకప్పుడేమో గానీ సినిమాల్లో ముద్దు సీన్స్ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయాయి. అడపాదడపా ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి.
స్టార్స్ నుంచి నార్మల్ యాక్టర్స్ వరకు ఆయా సీన్స్ లో జీవించేస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బిస్' దివి కూడా ముద్దులతో రెచ్చిపోయింది.
నటిగా చిన్న చిన్న రోల్స్ చేసిన దివి.. బిగ్ బాస్ 4వ సీజన్ లో ఓ కంటెస్టెంట్ గా వచ్చింది. తన గేమ్, గ్లామర్ తో మెప్పించింది.
ఆ సీజన్ తర్వాత షోలు చేస్తూ, ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ బిజీగా మారిపోయింది. గ్లామర్ విషయంలో ఏ మాత్రం అడ్డుచెప్పట్లేదు.
ఇక బిగ్ బాస్ ఫైనల్లో గెస్ట్ గా వచ్చిన చిరంజీవి.. తన సినిమాలో అవకాశమిస్తానని మాటిచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారు కూడా.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్ ఫాదర్' గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఇందులో సునీల్ భార్య పాత్రలో దివి నటించింది.
ఈ సినిమాలో దివి, అమాయక మహిళగా ఆకట్టుకునే యాక్టింగ్ చేసింది. తాజాగా రిలీజైన ఓ సిరీస్ లో మాత్రం చాలా డిఫరెంట్ రోల్ పోషించింది.
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రైటర్ మారి కథ అందించిన వెబ్ సిరీస్ 'ATM'. జనవరి 20న జీ5లో విడుదలైంది. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
డబ్బు దొంగతనం నేపథ్య కథతో తీసిన ఈ సిరీస్ లో 'బిగ్ బాస్' సన్నీతో పాటు సుబ్బరాజు, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక ఇదే సిరీస్ లో చిన్న రోల్ చేసిన దివి.. హీరో స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. ఇప్పుడు దివి ముద్దుపెట్టుకునే సీన్ ఒకటి వైరల్ గా మారింది.
దివి హాస్టల్ లో డబ్బులు కట్టకపోవడం వల్ల వార్డెన్ ఆమెని బయటకు వెళ్లిపోమని గొడవపెడుతుంటాడు. అదే టైంలో ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చి డబ్బు కటేస్తాడు.
గాయాలతో ఉన్న అతడు.. అక్కడ దివిని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఈ సీన్ ని రికార్డు చేసిన కొందరు నెటిజన్స్.. యూట్యూబ్ లో షేర్ చేశారు.
దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లామర్, యాక్టింగ్ విషయంలో దివి.. ఏ మాత్రం అడ్డుచెప్పకుండా బాగానే నటిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరి దివి ముద్దు సీన్స్ లో రెచ్చిపోవడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.