ఈ ఏడాది ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి వచ్చింది. దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటారు.
ఈరోజున అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను పఠించడాని చెబుతారు.
అంతేకాక ఇదే రోజున అంపశయ్య మీద నుంచే భీష్ముడు ధర్మరాజుకు అనేక రాజనీతి అంశాలను బోధించాడు.
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది.
భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి”, “మహాఫల ఏకాదశి”, “జయ ఏకాదశి” అని అంటారు.
ఈ రోజున విష్షు సహస్రనామాలు పఠిస్తే మోక్షం కలుగుతుందని చెబుతారు.
అలానే ఈ రోజు ఉపవాసం ఉండి.. ఏకాదశి వ్రత కథ విన్నా చాలా మంచిది అంటారు.