వర్షాకాలంలో తేమ పేరుకుపోవడం అనేక చర్మ సమస్యలు వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. సమస్య తీవ్రం అవుతుంది. ఇలాంటి సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని చిట్కాలు ట్రై చేయొచ్చు.
వీటి వల్ల చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో ఏయే సమస్యలు వస్తాయి.. అవి తగ్గేందుకు ఏమేం చేయాలో చూద్దాం..
తేమ పెరగడం వల్ల మీ చర్మంపై బ్యాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
ఈ కాలంలో లైట్ వెయిట్ జెల్ ఆధారిత్ స్కిన్ మాయిశ్చరైజర్ వాడండి.
చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉండేందుకు వారానికి కనీసం 2,3 సార్లు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి.
సాలిసిలిక్ యాసిడ్ ఆధారిత ఫేస్ వాష్‌ను ఎంచుకోవాలి. దీని వాడకం వల్ల మీ చర్మంపై ఉన్న సహజ నూనెలు పోకుండా ఉంటాయి.
ముల్తానీ మట్టి, చార్కోల్ వంటి మాస్క్‌లు చర్మంపై జిడ్డు, మలినాలను తొలగిస్తాయి.
మీ మేకప్ రొటీన్‌ని లైట్‌గా ఉండేలా చూసుకోండి. బయటికి వెళ్ళి ఇంటికొచ్చిన ప్రతిసారి మేకప్ తీసేయండి.
మీ ముఖాన్ని ఎక్కువగా కాకుండా రోజుకి ఒకటి లేదా రెండు సార్లు కడిగితే చాలు.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే సమస్య దూరమవుతుంది.
ముఖం మరి జిడ్డుగా ఉంటే ఓ రెండు చుక్కల నిమ్మరసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగండి.
అర్జీలు..
వర్షాకాలంలో అలర్జీలు రావడం కామన్. అవి చిరాకు, మంటను కలిగిస్తాయి. కాలుష్యం, వర్షం నీరు కారణంగా సమస్య పెరుగుతుంది. ఇది చివరికీ తామరగా మారుతుంది.
సున్నితమైన ఫేస్, స్కిన్ వాష్‌ని వాడండి.
కాబట్టి ఈ సమస్యను దూరం చేసేందుకు ఈ కింది టిప్స్ పాటించండి.
ఓట్స్, అలోవేరా, శాండల్ పౌడర్, కోకో బటర్, చామంతి ఇలా మీ చర్మ తత్వానికి సరిపడే సహజ ప్రొడక్ట్స్‌ని ఎంచుకొండి.
మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌లో ఆల్కహాల్, పారాబెన్, సువాసన లేనివాటిని ఎంచుకోండి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
మీ చేతులు, కాళ్ళు క్రమంగా కడుక్కోండి. పొడిగా, తేమగా ఉండేందుకు ప్రయత్నించండి.
టవల్స్, వాడే బట్టలు ఎవరితోనూ పంచుకోవద్దు.
కాటన్ క్లాత్స్ వాడడం మంచిది.
ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు టోనింగ్, మాయిశ్చరైజింగ్ రోటీన్ ఫాలో అవ్వండి.