ఆర్థిక పరిస్థితులు బాగోని కారణంగా ఈఎంఐ ఆలస్యం అవ్వడం, ఓవర్ డ్యూ అవ్వడం జరుగుతుంటాయి. దీని వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది.
ఒకసారి సిబిల్ స్కోర్ పడిపోయిన వ్యక్తికి మళ్ళీ బ్యాంకులు రుణాలు ఇవ్వవు.
అయితే ఈ విషయంలో కేరళ హైకోర్టు బ్యాంకులను హెచ్చరించింది.
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ అప్లికేషన్ ను తిరస్కరించకూడదని బ్యాంకులను హెచ్చరించింది కేరళ హైకోర్టు.
ఎడ్యుకేషన్ లోన్ కోసం అనేక మంది విద్యార్థులు అప్లై చేస్తుంటారు.
అయితే వీరు గతంలో తీసుకున్న లోన్ రైటాఫ్ అయినా, లోన్ సరిగా చెల్లించకపోయినా సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది.
అలాంటి విద్యార్థులు మళ్ళీ లోన్ కోసం అప్లై చేస్తే బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయి.
అయితే ఇకపై విద్యార్థుల లోన్ అప్లికేషన్ ను సిబిల్ తక్కువ ఉందన్న కారణంగా తిరస్కరించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎడ్యుకేషన్ లోన్లను పరిశీలించే క్రమంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోర్టు కోరింది.
విద్యార్థుల భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం కలగకూడదని కోర్టు సూచించింది.
నవ సమాజాన్ని నిర్మించేది విద్యార్థులే అని, దేశ భవిష్యత్తు వారే అని కోర్టు వెల్లడించింది.
కేవలం సిబిల్ స్కోర్ తక్కువ ఉందన్న కారణంగా లోన్ అప్లికేషన్ తిరస్కరించడం సరికాదని కోర్టు వెల్లడించింది.
తనకు బ్యాంకు లోన్ ఇవ్వలేదని ఓ విద్యార్థి వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా తీర్పు ఇచ్చారు.
ఒక లోన్ మీద రూ. 16,627 ఓవర్ డ్యూ ఉంది. మరో లోన్ ని బ్యాంక్ రైటాఫ్ చేసింది. దీంతో విద్యార్ధి సిబిల్ స్కోర్ తగ్గింది.
అయితే సిబిల్ స్కోర్ లేకపోయినా ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ని తిరస్కరించవద్దని కోర్టు తెలిపింది.