టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. నటి అతియ శెట్టిల వివాహం వైభవంగా జరిగింది.
వీరి పెళ్లి విషయాన్ని అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.
కూతురి వివాహ వేడుక సందర్భంగా సునీల్ శెట్టి.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు.
అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో అతియా, కేఎల్ రాహుల వివాహం జరిగింది.
పెళ్లి దుస్తుల్లో ఉన్న రాహుల్, అతియాల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి
అలానే పెళ్లి వేడుకలో వధువు అతియ ధరించిన లెహంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అతియ ధరించిన లెహంగాను తయారు చేయడానికి డిజైనర్లు చాలా కష్టపడారని తెలిసింది.
ఈ లెహంగా తయారీకి దాదాపు 10 వేల గంటల సమయం పట్టిందని ఫ్యాషన్ డిజైనర్ అనామిక తెలిపారు.
అతియ శెట్టి ధరించిన లెహంగా తయారీకి 416 రోజుల సమయం పట్టిందంట.
ఈ లెహంగాకు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా చేతితో తయారు చేయబడింది.
ఈ లెహంగా ను జర్దోజీ, జాలీ వర్క్ అనే పట్టుతో రూపొందించినట్లు అనామిక వివరించారు.
అతియా అందమైన అమ్మాయని, ఆమె పెళ్లి పీటలపై ఓ రాణిలా కనిపించేలా లెహంగా తయారీ చేశామని తెలిపారు.
అతియా శెట్టి కోసమే ఎంతో కష్టపడి ప్రత్యేకంగా ఈ లెహంగా ను డిజైన్ చేశామని ఆమె అన్నారు.
అతియా శెట్టిపై ఉన్న అభిమానంతో ఈ లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించారు.
అతియా శెట్టిపై ఉన్న అభిమానంతో ఈ లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించారు.