మనిషి శరీరానికి అతి ముఖ్యమైనవి ప్రోటీన్స్. బాడీని ధృఢంగా ఉంచడానికి ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి.

గుడ్లు, మటన్, చికెన్, చేపల్లో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. 

అయితే కొంత మంది వెజిటేరియన్ లు ఉంటారు. వారు నాన్ వెజ్ తినరు.

దాంతో వారి శరీరంలొ ప్రోటీన్స్ లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అలాంటి వారు తమ శరీరానికి ప్రోటీన్లు అందాలంటే ఈ క్రింది ఆహారపదార్థాలను తింటే సరిపోతుంది అంటున్నారు న్యూట్రీషియన్ నిపుణులు.

పాలను సంపూర్ణ ఆహారం అంటారని మనందరికి తెలుసు. 

పాలలో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లోపం ఉన్న వారు రోజుకు రెండు గ్లాసుల పాలు తాగితే చాలంటున్నారు నిపుణులు.

సోయాబీన్స్ లో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే వాటిని పేదవాడి మాంసంగా పిలుస్తారు.

అదీ కాక వీటిల్లో ఉండే కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు బాడీకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

వెజిటీరియన్స్ శరీరానికి ప్రోటీన్లు కావాలంటే తప్పని సరిగా పప్పులు తినాలి. 

పప్పును ప్రోటీన్ పవర్ హౌజ్ అంటారు. పప్పును రోజూ వారి ఆహారంలో చేర్చుకుంటే ప్రోటీన్ లోపం రాదంటున్నారు వైద్య నిపుణులు.

ఇవే కాక డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ లోపం అనేదే రాదు అంటున్నారు న్యూట్రీషియన్ నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు మీ శరీరాన్ని దృఢంగా మారుస్తాయి.

అయితే ఎంత వరకు మీ బాడీకి ప్రోటీన్ అవసరమో వైద్యులను సంప్రదించి.. వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.