తెలుగు సినీ పరిశ్రమల్లో స్వీటీ అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు.

తన స్వీట్ నేచర్ తో అందరినీ కలుపుకుంటూ పోతుంది.

గ్లామరస్ పాత్రలే కాకుండా అరుంధతి, వేదం, రుద్రమదేవి,బాహుబలి, భాగమతి, సైజ్ జీరో వంటి సినిమాల్లో నటనకి ఆస్కారం ఉన్న పాత్రలతోనూ మెప్పించింది.

అందంతో, అభినయంతో తెలుగునాట లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకుంది.

లేడీ సూపర్ స్టార్ కదా.. ఇక తిరుగుండదు. సమస్యలే ఉండవు అనుకోవడానికి లేదు.

ఎంత లేడీ సూపర్ స్టార్ అయినా తనకీ ఇబ్బందులు తప్పలేదట.

ఒక సినిమా షూటింగ్ లో చాలా ఇబ్బందులు పడిందట.

అరుంధతి లాంటి పవర్ ఫుల్ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో బిల్లా సినిమా ఆఫర్ వచ్చిందట.

అరుంధతిలో హుందాగా నటించిన అనుష్క.. బిల్లా సినిమాలో గ్లామరస్ గా చేస్తే బాగుంటుందా అని సంకోచించిందట.

మొత్తానికి మనసుకు సర్దిచెప్పుకుని నటించడానికి ఒప్పుకుందట.

అయితే బికినీ సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేసినట్టు చెప్పుకొచ్చింది.  

తనకి ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.