దేవుళ్లకు ఎలాంటి పూజలు నిర్వహించిన కూడా అందులో అగర్ బత్తీలను మాత్రం వెలిగిస్తారు.
అయితే అగర్ బత్తీలు వెలిగించడం అనే భక్తిలో ఎన్నో ఆరోగ్యం రహస్యాలు దాగి ఉన్నాయి.
అగర్ బత్తీలను వెలిగించడం వల్ల మనం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
ఇంట్లో రోజూ అగర్ బత్తీలను వెలిగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అరోమా థెరపీ ప్రకారం చక్కని వాసనలను పీల్చడం వల్ల పలు వ్యాధులు నయమవుతాయంట.
అగర్ బత్తీలను వెలిగించి వాటి వాసన చూస్తే అరోమాథెరపీ జరుగుతుంది.
అగర్ బత్తీల నుంచి వచ్చే సువాసన ఒత్తిడి, ఆందోళన తగ్గించి.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
ఈ అగర్ బత్తీల వాసన ద్వారా నిద్రలేమి నుంచి బయటవచ్చు.
నిద్ర సరిగ్గా పట్టని వారు రాత్రి పూట అగర్ బత్తీలను వెలిగించి కాసేపు ఉంటే చక్కగా నిద్రపడుతుంది.
బత్తీలను వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్న గాలి శుభ్రంగా మారుతుంది.
అగర్ బత్తీలను వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి..ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగు పడతాయి.
అగర్‌బత్తీలను వెలిగిస్తే ఇంట్లో వాతారవరణం ప్రశాంతంగా మారి చేసే పనిపై మరింత దృష్టి పెడతారు.
అలాగే అగర్‌బత్తీల నుంచి వచ్చే వాసనను పీల్చడం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
హార్మన్ల సమతుల్యంతో పలు రకాల రోగాలు రావు, వ్యాధులు దరిచేరవు.
కృత్రిమంగా, రసాయనాలతో తయారు చేసిన వాటిని వాడటం మంచిది కాదు.
సహజ సిద్ధమైన అగర్ బత్తీలు అయితేనే పైన తెలిపిన ప్రయోజనాలు పొందవచ్చు.