ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్​’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. 

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్న ‘ఆదిపురుష్​’లో.. రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. 

టీజర్​తో భారీ ట్రోలింగ్​కు గురైన ‘ఆదిపురుష్​’ ఈ ఏడాది సంక్రాంతికే ఆడియెన్స్ ముందుకు రావాల్సింది. 

ట్రోలింగ్​తో అలర్ట్ అయిన ఓం రౌత్ అండ్ కో.. మేకింగ్, వీఎఫ్​ఎక్స్ పరంగా పలు మార్పులు చేసి మొత్తానికి సినిమాను రిలీజ్​కు రెడీ చేశారు. 

 ఓం రౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. 

ప్రభాస్ మూవీకి తెలుగు నాట భారీగా బిజినెస్​ అయినట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఆదిపురుష్​’ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.170 కోట్లకు అమ్ముడుపోయాయని టాలీవుడ్ టాక్. 

ట్రైలర్స్​తో పాటు ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘ఆదిపురుష్​’పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్​పెక్టేషన్స్​ నెలకొనేలా చేశాయి. 

 టాలీవుడ్, బాలీవుడ్​తో పాటు కోలీవుడ్​లోనూ వచ్చే పది రోజులు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. 

ఈ నేపథ్యంలో బాక్సాఫీస్​ను ప్రభాస్​కు రాసిచ్చారనే చెప్పొచ్చు.

టాక్ బాగుంటే ‘ఆదిపురుష్​’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జాతర చేయడం ఖాయమనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే.. ఇంకా థియేటర్లలోకి రాకముందే ‘ఆదిపురుష్’ ఓటీటీ రిలీజ్​పై ఆసక్తి ఏర్పడింది.

తీవ్ర పోటీ నడుమ ‘ఆదిపురుష్’ ఓటీటీ రైట్స్​ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. 

అయితే ‘ఆదిపురుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే అని సమాచారం.

ఆ లెక్కన జూన్​ 16న విడుదలవుతున్న ప్రభాస్ మూవీ.. ఆగస్టు 15వ తేదీకి కాస్త అటు ఇటుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.