ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ఈ సినిమా దాదాపు 700 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు సమాచారం.
ఆదిపురుష్‌లో రాముడి పాత్ర కోసం ప్రభాస్ దాదాపు 100-150 కోట్ల రూపాయలు తీసుకున్నారట.
రావణుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ 12 కోట్లు తీసుకున్నారట.
సీత పాత్రలో నటించిన కృతీ సనన్ 3 కోట్ల రూపాయలు తీసుకున్నారట.
లక్ష్మణుడి పాత్రలో నటించిన సన్నీ సింగ్ 1.5 కోట్లు రూపాయలు తీసుకున్నారట.
ఆంజనేయుడి పాత్రలో నటించిన దేవ దత్త నాగే కోటి రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారట.
ఈ సినిమా మొదటి రోజు 100 కోట్ల రూపాయలు వసూళు చేస్తుందని అంచనా.