హైదరాబాద్ సౌత్ జోన్ లో డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఆదిభట్ల ఒకటి.
హైదరాబాద్ లో మరో ఐటీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ గా ఆదిభట్ల రూపాంతరం చెందుతోంది.
దీంతో ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది.
ఐటీ, ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో ఉన్న ఆదిభట్లలో ఇప్పటికే టాటా ఏరోస్పేస్ సెజ్, టీసీఎస్ ఆదిభట్ల క్యాంపస్ లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
మన్నెగూడ, బొంగ్లూర్ ఏరియాలు ఆదిభట్లకు 7 నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్నాయి.
శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అవుటర్ రింగ్ రోడ్ కి ఆదిభట్ల చాలా దగ్గరలో ఉంది.
ఆదిభట్లలో ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తి చేసి విక్రయిస్తున్నాయి.
కస్టమర్ అభిరుచికి తగ్గట్టు స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలను అందిస్తున్నాయి.
ఆదిభట్లలో కొన్ని చోట్ల చదరపు అడుగు యావరేజ్ గా రూ. 1550 నుంచి రూ. 2900 మధ్యలో ఉన్నాయి.
ఇంకొన్ని చోట్ల చదరపు అడుగు రూ. 1500 నుంచి రూ. 2600 రేంజ్ లో ఉన్నాయి.
గజం స్థలం రూ. 13,400, రూ. 13,950, రూ. 18,340, రూ. 23,300, రూ. 26,100 రేంజ్ లో ఉన్నాయి.
150 గజాల స్థలానికి రూ. 20,10,000 నుంచి రూ. 39,15,000 అవుతుంది.
ఆదిభట్లలో యజమానులు విక్రయిస్తున్న స్థలాల ధరలు చదరపు అడుగుకి రూ. 694, రూ. 919, రూ. 956, రూ. 1,111, రూ. 1320, రూ. 1556, రూ. 1,778, రూ. 2,000 రేంజ్ లో ఉన్నాయి.
20 లక్షల బడ్జెట్ లో 150 గజాల నుంచి 200 గజాల స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.
అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.