మన పూర్వీకుల కాలం చాలా గొప్పదని చెప్పవచ్చు. ఆ ఆహారం, తిండి తీరే వేరు. వారి బలం ముందు మనం పూచుకుపుల్లకు పనికిరాం

అలాగే  ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పైరు, సెలయేళ్లు, చెరువులు, కొండ కోనలు ఉండేవి. అందమైన ప్రకృతి వారి సొంతం

 పొద్దున ఎలా ఉన్నా పనులు ముగించుకుని  సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి.. చిమ్మ చీకటి ఉండేది. 

విద్యుత్ లేని సమయంలో అయితే ఆరు బయట మంచాలు వేసుకుని పడుకునేవారు. చల్లటి గాలికి హాయిగా ప్రాణం ఏటో పోయినట్లు ఉండేది.

ఇక వేసవి కాలంలో అయితే విసన కర్రలు తీసుకుని విసురుకుని పడుకునేవారు. కానీ నేడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.

ఆ సమయంలోనే సంపాదన పెరిగి.. నివాసాల కో్సం అడవులను, చెట్లను తొలిచి కట్టుకోవాల్సిన పరిస్థితి. 

దీంతో కుగ్రామాలు.. గ్రామాలుగా, తర్వాత నగరాలు, పట్టణాలుగా ఏర్పడ్డాయి. దీంతో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి.  

పెరుగుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడగాలులకు ఉండలేని పరిస్థితి.

ఫ్యాను నుండి కూలర్, కూలర్ నుండి ఏసీకి వస్తువులు అత్యాధునికతను సంతరించుకున్నాయి.

ప్రస్తుతం ప్రతి ఇంట్లోనే ఏసీ ఉండాల్సిందే.  రాత్రి నిద్రలేమితో బాధపడలేక.. సగటు మానవుడు కూడా ఏసీ వంటి వస్తువును ఏర్పాటు చేసుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు  ఈ ఏసీ, కూలర్ లాంటి వస్తువులు పేలి.. ప్రాణాలు తీస్తున్నాయి. ఇవి యమ  పాశాల్లా మారుతున్నాయి. ఇటీవల కాలంలో అనేక సంఘటనలు జరిగాయి.

అసలు ఎందుకు ఏసీ పేలుతున్నాయంటే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల అట

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కూడా అధిక వేడి కారణంగా ఏసీలు వేడెక్కుతాయని, మంటలు చెలరేగే ముప్పు ఉంటుందని చెబుతున్నారు.

అధిక వేడి, ఒత్తిడితో కారణంగా ఏసీలో ఉపయోగించే గ్యాస్ లీకై పేలుడు సంభవించవచ్చని చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో ఎక్కువ గంటలు నిరంతరాయంగా ఏసీలు ఉపయోగించడం మంచిది కాదని వివరిస్తున్నారు. 

స్టెబిలైజర్లను ఉపయోగించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు. 

 దీంతో పాటు ఏసీలను  రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలని సూచిస్తున్నారు.