AAA సినిమాస్ ఈ గురువారం ఉదయం అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభం అయింది.
రేపటి నుంచి ఈ సినిమా హాల్లో సినిమాల ప్రదర్శన మొదలు కానుంది.
మొదటి షో ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆది పురుష్’తో ప్రారంభం కానుంది.
ఏఏఏ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 5 స్క్రీన్లు ఉన్నాయి.
వీటి సీట్ల సామర్థ్యం 1350గా ఉంది.
ఈ ఐదు స్క్రీన్లలో ఓ స్క్రీన్ ఎల్ఈడీదీ కావటం విశేషం.
ఏఏఏ సినిమాస్లో హాళ్లతో పాటు షాపింగ్ చేసుకోవటానికి మాల్స్ ఉన్నాయి.
అంతేకాదు! ఇందులో గేమింగ్ కూడా అందుబాటులో ఉంది.
త్వరలో రెస్టారెంట్ కూడా ప్రారంభం కానుంది.
ఇక, ఈ ఏఏఏ నిర్మాణంలో నారాయణ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్ భాగాస్వామ్యులయ్యారు.
2021 నవంబర్ నెలలో ఏఏఏకు సంబంధించి అల్లు అర్జున్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి.